శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 20:05:58

సోషల్‌ మీడియాలో కరోనా: యువకులు అరెస్ట్‌

సోషల్‌ మీడియాలో కరోనా: యువకులు అరెస్ట్‌

వరంగల్‌: కరోనా కలకలం అంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు రాజేశ్‌, రాజు, అనిల్‌లపై కేసు నమోద చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ చట్టాలు ఉల్లంఘించి బయట తిరగడం, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతార్‌ చేసి రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ చేశామని, సీజ్‌ చేసిన వాహనాలను లాక్‌డౌన్‌ ఉత్తర్వులు తొలగిన తరువాతనే విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్య ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రజలు తప్పని సరిగా పాటించాలని పేర్కొన్నారు. 


logo