మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 12, 2020 , 17:11:40

వరంగల్‌ నిట్‌ విద్యార్థికి కరోనా వైరస్‌ లక్షణాలు

వరంగల్‌ నిట్‌ విద్యార్థికి కరోనా వైరస్‌ లక్షణాలు

వరంగల్‌: కరోనా వైరస్‌ లక్షణాలతో నిట్‌ విద్యార్థి ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని వైద్యులు హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే అమెరికాలో జరిగిన ఒక సదస్సులో విద్యార్థి పాల్గొని వచ్చాడు. దేశంలో ఇప్పటి వరకు 73 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ర్టాల వారిగా నమోదైన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బాధితుల్లో 17 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. కేరళలో 17, హరియాణా 14, ఉత్తరప్రదేశ్‌ - 11, మహారాష్ట్రలో 11 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 6, కర్ణాటక -4, రాజస్థాన్‌ -3, లద్ధాక్‌లో 3 కరోనా కేసులు, తెలంగాణ, తమిళనాడు, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌ రాష్ర్టాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 


logo
>>>>>>