మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 09:38:53

127 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌

127 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌

హైదరాబాద్‌: ఇప్పటి వరకు కరోనా వైరస్‌ 127 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 34 వేల717 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా 4,979 మంది మృతి చెందారు. చైనాలో 3,176కి కరోనా మృతులు సంఖ్య చేరుకుంది. ఇటలీలో 1,016కి మృతుల సంఖ్య చేరుకుంది. ఇరాన్‌లో 429 మంది మృతి చెందారు. దక్షిణ కొరియాలో 67 మంది, స్పెయిన్‌లో 86 మంది, ప్రాన్స్‌లో 61 మంది, అమెరికాలో 41 మంది మృతి చెందారు. కెనడియన్‌ ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో సతీమణికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

కరోనాపై సమాచారం కోసం హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. 

తెలంగాణ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 104,

ఆంధ్రప్రదేశ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 0866 2410978,

సెంట్రల్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 011 23978046,ను ఏర్పాటు చేశారు. 


logo