బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 20:52:56

వచ్చిపోయేవారిపై నజరేసిన సర్కార్‌

వచ్చిపోయేవారిపై నజరేసిన సర్కార్‌

హైదరాబాద్‌: ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వలస వస్తున్న వారితో కరోనా వైరస్‌ విస్తరిస్తున్నట్టు తెలుస్తున్నది. గత 6 రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 38 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిపట్ల భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం వలసలు వస్తున్నవారిపై ప్రత్యేకదృష్టి సారించింది. జిల్లాల్లోకి ప్రవేశిస్తున్న కొత్తవారి వివరాలను నమోదు చేసుకొని, వారికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని వెంటనే వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం దవాఖానకు తరలిస్తున్నారు. గత ఐదు రోజుల్లో ఆయా జిల్లాల నుంచి 66,959 మంది బయటకు వెళ్లగా, 41,805 మంది ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు. 


logo