శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:40:31

మరో ఆరుగురికి కరోనా

మరో ఆరుగురికి కరోనా

  • ఇండోనేషియన్లతో తిరిగిన వ్యక్తికి పాజిటివ్‌
  • రాష్ట్రంలో 33కు చేరిన కేసులు
  • వైద్యారోగ్యశాఖ బులెటిన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు గతంలో పాజిటివ్‌గా నమోదైన బాధితులకు సన్నిహితులైన స్థానికులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అవుతున్నది. సోమవారం ఒక్కరోజే ఆరుగురికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. వారిని ఐసొలేషన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన హైదరాబాద్‌లోని బల్కంపేటవాసి (21), లండన్‌నుంచి వచ్చిన శాంతినగర్‌వాసి (30), అధిక సంఖ్యలో పాజిటివ్‌గా నమోదైన ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన కరీంనగర్‌వాసి (23), న్యూయార్క్‌ నుంచి వచ్చిన విద్యార్థి (20), లండన్‌ నుంచి వచ్చిన గచ్చిబౌలివాసి (25), శ్రీలంక వెళ్లివచ్చిన కూకట్‌పల్లికి చెందిన వ్యాపారవేత్త (56)లకు నిర్ధారణ పరీక్షల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా నమోదైంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నమోదైన 33 మందిలో ఒకరు ఇప్పటికే పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, మిగిలిన 32 మందిని ఐసొలేషన్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.


logo