గురువారం 16 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 07:12:08

బంజారాహిల్స్‌ పీఎస్‌లో కరోనా.. ఎస్‌ఐతో పాటు పోలీసులకు పాజిటివ్‌

బంజారాహిల్స్‌ పీఎస్‌లో కరోనా.. ఎస్‌ఐతో పాటు పోలీసులకు పాజిటివ్‌

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారంరోజుల్లో పోలీస్‌స్టేషన్‌లో కరోనా బారిన పడినవారి సంఖ్య పదికి చేరుకుంది. బంజారాహిల్స్‌ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో మిగిలిన సిబ్బందికి మొత్తం పరీక్షలు చేస్తున్నారు. రోజుకు సుమారు 20 మందిని గోషామహల్‌తో పాటు ఇతర దవాఖానలకు పంపించి పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో రెండురోజుల క్రితం చేసిన పరీక్షల్లో ఒక ఎస్సై, ఆరుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డుకు పాజిటివ్‌ రావడంతో వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. రోజుకు వందలాదిమంది వచ్చే బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులకు కరోనా సోకిందని తేలడంతో జనం బెంబేలెత్తుతున్నారు.


logo