ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 01:51:09

ఐటీ కారిడార్‌లో నో ఎఫెక్ట్‌

ఐటీ కారిడార్‌లో నో ఎఫెక్ట్‌
  • విధులకు హాజరైన టెకీలు

కొండాపూర్‌: కొవిడ్‌-19 అనుమానిత కేసుతో కలకలం రేగిన మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లో గురువారం ప్రశాంత వాతావరణం నెలకొన్నది. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న టెకీలు యథావిధిగా విధులకు హాజరయ్యారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. మాస్క్‌లతోపాటు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. మైండ్‌స్పేస్‌ భవనసముదాయంలోని పెగా సిస్టమ్స్‌ తన ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కరోనా వైరస్‌పై అసత్య ప్రచారాలను నమ్మవద్దని సంస్థ ఎండీ సుమన్‌రెడ్డి ఉద్యోగులను కోరారు.


logo