మంగళవారం 14 జూలై 2020
Telangana - Apr 08, 2020 , 01:06:20

కరోనా కొత్తకేసులు 40

కరోనా కొత్తకేసులు 40

  • మొత్తం పాజిటివ్‌ 404..45 మంది డిశ్చార్జి
  • 348 మందికి ఐసొలేషన్‌లో చికిత్స
  • వైద్యారోగ్యశాఖ బులెటిన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ పాజిటివ్‌ ఉన్న 348 మందికి వివిధ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మంగళవారం 40 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. దీంతో మొత్తం వైరస్‌ సోకినవారి సంఖ్య 404కు చేరినట్టు బులెటిన్‌లో పేర్కొన్నది. చికిత్సపొందినవారు 45 మంది డిశ్చార్జి అయినట్టు తెలిపింది. తబ్లిగీ వెళ్లి వచ్చివారికి, వారి కుటుంబసభ్యుల్లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేస్తున్నట్టు వెల్లడించింది. కాగా, అనుమానిత లక్షణాలున్నవారికి 24 గంటలపాటు ఆరు ల్యాబ్‌లలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, పాజిటివ్‌ వ్యక్తులు కలిసిన (కాంటాక్ట్‌) వారిని గుర్తించడంపై సర్వేలెన్స్‌ బృందాలు నిరంతరం పనిచేస్తున్నట్టు పేర్కొన్నది. 

శక్తిమంతమైన అమెరికా సైతం కరోనాతో విలవిలలాడుతున్నదని, ముందు జాగ్రత్తల ద్వారానే మనకు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోగలమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మంగళవారం తెలిపారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు చికిత్స అందించడానికి అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లను లక్షల సంఖ్యలో సమకూర్చుకుంటున్నామన్నారు. సీఎం కార్యాలయం నుంచి ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు. గొప్పగా పనిచేస్తున్న ఆరోగ్యశాఖ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, పోలీస్‌ సిబ్బందికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

చికిత్స పొందుతున్న, కోలుకుంటున్నవారి సంఖ్య 

వివరాలు
మంగళవారం ఒక్కరోజు
ఇప్పటివరకు మొత్తం 
కొవిడ్‌-19 వైరస్‌ పాజిటివ్స్‌
40
404 
కోలుకున్న/డిశ్చార్జి అయినవారు
12
45
మరణాలు
--
11
చికిత్స పొందుతున్నవారు
348
348


logo