బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 17:09:53

రాష్ట్రంలో కరోనా కట్టడి : మంత్రి జగదీశ్‌ రెడ్డి

రాష్ట్రంలో కరోనా కట్టడి : మంత్రి జగదీశ్‌ రెడ్డి

సూర్యాపేట : సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా కట్టడి అయిందని, ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో పేదలకు, పారిశుద్ధ్య సిబ్బందికి బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను మంత్రి నేడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సూర్యాపేట పట్టణంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు. ప్రజల సహకారం, అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. 

ముఖ్యంత్రి కేసీఆర్‌ ప్రతీక్షణం ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారని దాని ఫలితంగానే రాష్ట్రంలో కరోనా మహమ్మారి ని అదుపు చేయగలిగామన్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏ ఒక్కరు ఆకలితో ఇబ్బందులు పడొద్దన్న సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు వారి ప్రాంతాల్లో ఉన్న పేదవారికి, వలస కార్మికులకు అన్ని విధాల అండగా నిలవాలన్నారు. అపోహలు, వదంతులు నమ్మకుండా ప్రజలు ప్రభుత్వ నిబంధనలను పాటించి మరికొన్ని రోజులు ఇంటికే పరిమితం కావాలని కోరారు.




logo