గురువారం 28 మే 2020
Telangana - May 17, 2020 , 00:13:54

మరింత జాగ్రత్తగా ఉండాలి

మరింత జాగ్రత్తగా ఉండాలి

 • నిమ్స్‌ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ పరంజ్యోతి

హైదరాబాద్‌,సిటీబ్యూరో: రానున్న రోజుల్లో కరోనా సోకకుండా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని నిమ్స్‌ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ పరంజ్యోతి సూచించారు. వైరస్‌పై ప్రజలందరికీ పూర్తి అవగాహన వచ్చిందని, దీంతో జీవనశైలి మారిందని పేర్కొన్నారు. కేసులు పెరిగినా తట్టుకొనే ఆరోగ్య మౌలిక సదుపాయాలు మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ప్రజలు వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు.

 • గుంపులుగుంపులుగా ఉండకూడదు.
 • ఏటీఎం సెంటర్లలో డబ్బు డ్రా చేసిన వెంటనే చేతులకు శానిటైజర్‌ రుద్దుకోవాలి.
 • బార్బర్‌ షాపులు, బ్యూటీపార్లర్లల్లో చాలా జాగ్రతగా ఉండాలి. ఇలాంటి ప్రదేశాలే వైరస్‌ వ్యాప్తికి స్థావరాలు.
 • అనవసర సమావేశాలు నిర్వహించకూడదు. సమావేశాలు తప్పనిసరైతే భౌతికదూరం పాటించాలి.
 • ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు నడుముకు బెల్టు, చేతికి వాచి, ఉంగరాలు వంటివి ధరించ కూడదు. ఇవి వైరస్‌ వాహకాలుగా పనిచేస్తాయి.
 • చెప్పులు, ష్యూతో ఇండ్లల్లోకి వెళ్లకూడదు. బయటకి వెళ్లి వచ్చినప్పుడు తప్పనిసరిగా కాళ్లు, చేతులు శుభ్రంగా కడుకోవాలి.
 • కరోనా లక్షణాలున్న అనుమానితులు ఎదురైనట్టు అనిపిస్తే వెంటనే శుభ్రంగా స్నానం చేయాలి.
 • దవాఖానలకు వెళ్లినప్పుడు భౌతికదూరం తప్పక పాటించాలి.
 • ఇతర వ్యాధిగ్రస్థులకు దూరంగా ఉండాలి.
 • చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకపోవడం మంచిది.
 • బీపీ, షుగర్‌, గుండె, కిడ్నీ, కాలేయ వ్యాధులు, టీబీ, హెచ్‌ఐవీ వంటి వ్యాధులున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.
 • కార్యాలయాల్లో భౌతికదూరం పాటించాలి. 
 • బహిరంగప్రదేశాల్లో ఉమ్మివేయరాదు. పాన్‌మసాల, గుట్కాలకు దూరంగా ఉండాలి.
 • ద్విచక్రవాహనాలపై ఒక్కరే ప్రయాణించాలి.
 • ముఖ్యంగా కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లు, పండ్ల మార్కెట్లు, అంగళ్లు వంటి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలి.
 • సాధ్యమైనంత వరకు డిజిటల్‌ లావాదేవీలే ఉత్తమం.
 • కనీసం ఏడాదివరకు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.


logo