ఆదివారం 07 జూన్ 2020
Telangana - Mar 29, 2020 , 00:08:00

మురుగునీటిలో కరోనా వైరస్‌!

మురుగునీటిలో కరోనా వైరస్‌!

  • గుర్తించిన నెదర్లాండ్స్‌ పరిశోధకులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మురుగునీటిలో కరోనా వైరస్‌ ఉన్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌' సంస్థ గుర్తించింది. కరోనా బాధితుల మలం ద్వారా ఇది మురుగునీటిలో కలుస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో వైరస్‌ సంక్రమించకుండా చూడడంలో మురుగునీటి నిర్వహణ కూడా ముఖ్యమైన అంశమని పేర్కొంది. పారిశుద్ధ్య కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మురుగునీటిని నేరుగా తాకకూడదని, రక్షిత దుస్తులు, బూట్లు, కండ్ల అద్దాలు, మాస్కులు ధరించాలని సూచించింది. గతంలోనూ మురుగునీటిలో పోలియో, తట్టు కారక వైరస్‌లు, యాంటీబయోటెక్‌ రెసిస్టెంట్‌ బ్యాక్టీరియా ఉనికిని గుర్తించినట్లు తెలిపింది. కరోనా వైరస్‌ను మాలిక్యులార్‌ విధానాలను ఉపయోగించి ఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లో గుర్తించారు.


logo