ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 12:00:28

ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌లో కరోనా.. ఇద్దరు ఎస్‌ఐలకు పాజిటివ్‌

ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌లో కరోనా.. ఇద్దరు ఎస్‌ఐలకు పాజిటివ్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో కరోనా కలకలం రేపింది. తాజాగా ఇద్దరు ఎస్‌ఐలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు శుక్రవారం ఉదయం వైద్యాధికారులు వెల్లడించారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదే పోలీసు స్టేషన్‌లో ఇప్పటికే 31 మంది పోలీసులకు కరోనా సోకింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 33కు చేరింది. పీఎస్‌ సిబ్బంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

హైదరాబాద్‌లో నిన్న ఒక్కరోజే 662 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,826కు చేరింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 39,327 మంది కోలుకున్నారు. 447 మరణాలు సంభవించాయి. 


logo