గురువారం 28 మే 2020
Telangana - May 20, 2020 , 02:28:43

నిజమే.. తెలంగాణలో కేసులు తక్కువే

నిజమే.. తెలంగాణలో కేసులు తక్కువే

  • అక్కడి నుంచి తిరిగొచ్చిన కార్మికుల్లో ఆరుగురికే వైరస్‌
  • బీహార్‌ ప్రభుత్వ నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌-19 పరీక్షలు తక్కువ మందికి చేయడంవల్లనే కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువగా వస్తున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బీహార్‌ ప్రభుత్వం దీటైన సమాధానం ఇచ్చింది. ఇతర రాష్ర్టాల నుంచి తిరిగివచ్చిన వలస కార్మికుల్లో తెలంగాణనుంచి వచ్చినవారిలోనే కరోనా రోగులు అతి తక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు బీహార్‌ ప్రభుత్వం మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ నుంచి బీహార్‌కు 367 మంది చేరుకోగా.. వారిలో ఆరుగురికి (2 శాతం) మాత్రమే కరోనా నిర్ధారణ అయ్యింది. 

ఈ విషయాన్ని బీహార్‌ ఆరోగ్యశాఖ ముఖ్య అధికారి సంజయ్‌కుమార్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. ఢిల్లీ నుంచి 845 మంది వలసకార్మికులు తిరిగిరాగా, వారిలో 218 (26 శాతం) మందికి కరోనా సోకినట్టు తెలిపారు. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వచ్చినవారిలో 11 శాతం, పశ్చిమబెంగాల్‌నుంచి వచ్చినవారిలో 12 శాతం, హర్యానానుంచి వచ్చినవారిలో 9 శాతం మందికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలిపారు. బీహార్‌ ప్రభుత్వం చేసిన కొవిడ్‌ పరీక్షలతో తెలంగాణలో కరోనా కట్టడిలోనే ఉన్న విషయం తేటతెల్లమైంది. కరోనా సోకినవారి కాంటాక్ట్‌లను గుర్తించి, పరీక్షలు చేయడంలో తెలంగాణలో పూర్తి కచ్చితత్వాన్ని పాటిస్తున్నారన్న విషయం మరోమారు నిరూపితమైంది.


తిరిగొచ్చిన వారికి బీహార్‌ నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రం
శాంపిళ్లు
పాజిటివ్‌
శాతం
ఢిల్లీ
83521826
పశ్చిమబెంగాల్
2653312
హర్యానా
3903609
మధ్యప్రదేశ్
940505
రాజస్థాన్‌
4301604
తమిళనాడు
570204
తెలంగాణ
3670602


logo