మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 28, 2020 , 20:09:25

ఎగ్‌, చికెన్‌, మటన్‌, ఫిష్‌ వేటికీ కరోనా లేదు: మంత్రి కేటీఆర్‌

ఎగ్‌, చికెన్‌, మటన్‌, ఫిష్‌ వేటికీ కరోనా లేదు: మంత్రి కేటీఆర్‌

కరోనా వైరస్‌కు చికెన్‌, గుడ్లకు ఎలాంటి సంబంధం లేదు.

హైదరాబాద్‌: నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో చికెన్‌, ఎగ్‌ మేళా నిర్వహించారు. చికెన్‌పై వస్తున్న పుకార్ల నేపథ్యంలో అవగాహన కల్పనే లక్ష్యంగా నెక్‌, పౌల్ట్రీ సమాఖ్య ఆధ్వర్యంలో చికెన్‌, ఎగ్‌ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రులు,  ఎంపీలు, ఎమ్మెల్యేలు చికెన్‌తో పాటు గుడ్లు తిన్నారు.  చికెన్‌, ఎగ్‌ మేళాకు నగరవాసులు భారీ ఎత్తున తరలివచ్చారు. 

కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'వరి, పత్తి, మొక్కజొన్న మన దగ్డర పండే ప్రధాన పంటలు. చికెన్‌పై దుష్ప్రచారాలు, అపోహలు నమ్మొద్దు. ఎగ్‌, చికెన్‌, మటన్‌, ఫిష్‌ వేటికీ కరోనా లేదు. మనం వండుకునే విధానంలో అలాంటి వైరస్‌లు బతకనే బతకవు. పౌల్ట్రీ ఇండస్ట్రీపై మొక్కజొన్నతో పాటు పలు రకాల పంటలు పండించే రైతులు ఆధారపడి ఉన్నారు. వారిని డీలా పరిచేలా తప్పుడు ప్రచారాలు తగదు. దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీని త్వరలోనే తీసుకొస్తాం. పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుంది. పౌల్ట్రీ పరిశ్రమ  పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ రైతులకు బాసటగా నిలుస్తోంది. పలు రంగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం చికెన్‌, గుడ్లు పంపిణీ చేస్తోంది. కరోనా వైరస్‌కు చికెన్‌, గుడ్లకు ఎలాంటి సంబంధం లేదు.' అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 



logo