శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 24, 2020 , 02:20:57

రికవరీ రేటు 77.3 %

రికవరీ రేటు 77.3 %

  • ఒక్కరోజే 1,661 మంది ఇంటికి
  • తాజాగా 1,567 మందికి కరోనా
  • తొమ్మిది మంది మృత్యువాత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా సోకి కోలుకొంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గురువారం రికవరీ రేటు రికార్డుస్థాయిలో 77.3 శాతంగా నమోదైంది. ఒక్కరోజే 1,661 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకొని క్షేమంగా ఇంటికిచేరారు. దీంతో మొత్తం కేసుల్లో కోలుకొన్నవారి సంఖ్య 39,327కు చేరుకున్నదని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. తాజాగా గురువారం 13,367 నమూనాలను పరీక్షించగా, 1,567 పాజిటివ్‌గా తేలాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 662 కేసులు నమోదయ్యాయి. 

రంగారెడ్డి జిల్లాలో 213, వరంగల్‌ అర్బన్‌లో 75, రాజన్న సిరిసిల్లలో 62, మహబూబ్‌నగర్‌లో 61, నాగర్‌కర్నూల్‌లో 51, నల్లగొండలో 44, సూర్యాపేటలో 39, నిజామాబాద్‌, కరీంనగర్‌లలో 38 చొప్పున, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 33, సంగారెడ్డిలో 32, మెదక్‌లో 27, జయశంకర్‌ భూపాలపల్లిలో 25, వరంగల్‌ రూరల్‌, జనగామలో 22 చొప్పున, మహబూబాబాద్‌లో 18, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ములుగులో 17 చొప్పున, జగిత్యాలలో 14, ఖమ్మంలో 10, సిద్దిపేటలో 9, వికారాబాద్‌లో 5, యాదాద్రి భువనగిరి, ఆసిఫాబాద్‌లో 4 చొప్పున, జోగుళాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లిలో 2 చొప్పున, మంచిర్యాల, నిర్మల్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనాకు తోడు ఇతర అనారోగ్యకారణాల వల్ల తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 447కు చేరింది. ఇది ఒక్క శాతం కంటే తక్కువే.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
 గురువారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
 1,567
50,826 
డిశ్చార్జి అయినవారు
1,661
39,327
మరణాలు
9 447
చికిత్స పొందుతున్నవారు
-11,052


logo