శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 15:54:00

జీహెచ్‌ఎంసీ సిబ్బందికి కరోనా పరీక్షలు

జీహెచ్‌ఎంసీ సిబ్బందికి కరోనా పరీక్షలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీలో జూనియర్‌ అసిస్టెంట్‌కు కరోనా నిర్ధారణ కావడంతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించాలని అధికారులు నిర్ణయించారు.

కొవిడ్‌-19 ఇతరులకు సోకకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కరోనా పరీక్షలు చేయించుకోవాలని హెల్త్‌ సెక్షన్‌లో పని చేసే సుమారు 40 మంది సిబ్బందికి సమాచారం అందించారు.


logo