గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 12:58:29

కరోనాతో బంజారాహిల్స్‌ ఏఎస్సై మృతి

కరోనాతో బంజారాహిల్స్‌ ఏఎస్సై మృతి

హైదరాబాద్‌: కరోనాతో చేస్తున్న యుద్ధంలో ముందువరుసలో నిలుస్తున్న పోలీసులు, వైద్యులు, సిబ్బంది కరోనాకు బలి అవుతున్నారు.  బంజారాహిల్స్‌లో  గత మూడేళ్లుగా  ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్‌కుమార్‌(55) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వారం రోజుల క్రితం శ్వాసకోస సమస్యతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యింది.

దీంతో అతడిని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఏఎస్సైకి 3,4 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో కరోనా తోడు కావడంతో శుక్రవారం ఆస్పత్రిలో మృతిచెందాడు.  ఏఎస్సై మృతిపట్ల పోలీసు అధికారులు, సహచరులు విచారం వ్యక్తం చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo