శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 07:31:40

సింగరేణి దవాఖానల్లో క‌రోనా వార్డులు

సింగరేణి దవాఖానల్లో క‌రోనా వార్డులు

హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో కరోనా కట్టడికి సంస్థ యజమాన్యం చర్యలు చేపట్టింది. 11 ఏరియాల్లో ఉన్న కంపెనీ దవాఖానల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసింది. క్వారంటైన్‌ కేంద్రాలుగా సీఈఆర్‌ క్లబ్బులు, కమ్యూనిటీ హాళ్లు, సింగరేణి పాఠశాలలతోపాటు ఇతర భవనాలను సిద్ధంచేయాలని నిర్ణయించింది. సీఎండీ శ్రీధర్‌ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్ వెల్లడించారు.

కరోనా వైద్య సేవల్లో ప్రత్యక్షంగా పనిచేసే సింగరేణి డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ప్రతి నెలా మూలవేతనంపై 10 శాతం ప్రోత్సాహక అలవెన్సులు ఇస్తుందని, ప్రభుత్వం కల్పించిన రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని వారికి వర్తింపజేస్తుందని చెప్పారు. ఏదైనా గనిలో కరోనా కేసులు పెరిగితే కార్మికుల రక్షణ కోసం కొంతకాలంపాటు మూసివేస్తామని ప్రకటించారు. 


logo