ఆదివారం 31 మే 2020
Telangana - May 06, 2020 , 02:17:20

ఢిల్లీలో కరోనా బాధిత జర్నలిస్టులకు సాయం

ఢిల్లీలో కరోనా బాధిత జర్నలిస్టులకు సాయం

  • 12 లక్షలు విడుదలచేసిన ప్రభుత్వం
  • పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆరా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఢిల్లీలో కొందరు తెలుగు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వారి పరిస్థితిపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆరాతీశారు. పాత్రికేయులకు అవసరమైన సహాయాన్ని అందించాలని మంగళవారం అధికారులను ఆదేశించారు. తెలంగాణభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జర్నలిస్టులకోసం ప్రభుత్వం రూ.12 లక్షలు విడుదలచేసింది. తక్షణ సాయం కింద ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.75వేలు నగదు విడుదలచేశారు.

మీడియా అకాడమీ సహాయం

కరోనా పాజిటివ్‌ వచ్చిన జర్నలిస్టులకు తెలంగాణ మీడియాఅకాడమీ ఆర్థికసాయం అందించింది. ఢిల్లీలో ముగ్గురు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఒక జర్నలిస్టుకు రూ.20వేల వంతున సాయం అందించినట్టు చెప్పారు. హోంక్వారంటైన్‌లో ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐదుగురు, గద్వాలలోని నలుగురు జర్నలిస్టులకు రూ.10 వేల చొప్పున సాయమందించామన్నారు.


logo