శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 11, 2020 , 18:36:40

జులై - ఆగస్టు మాసాల్లోనే కరోనాకు వ్యాక్సిన్! : సీఎం కేసీఆర్

జులై - ఆగస్టు మాసాల్లోనే కరోనాకు వ్యాక్సిన్! : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఈ ఏడాది జులై - ఆగస్టు మాసాల్లోనే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశంలోని అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశం నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ కు చెందిన కంపెనీలు బాగా కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ వచ్చే చాన్స్ ఉంది. జూలై-ఆగస్టు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అని సీఎం అన్నారు. వ్యాక్సిన్ వస్తే పరిస్థితిలో మార్పు వస్తుంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. వైద్యపరంగా సర్వ సిద్ధంగా ఉన్నాం. పరికరాలు, మందులు, మాస్కులు, పిపిఇ కిట్లు, బెడ్లు.. ఇలా కావాల్సినవన్నీ ఉన్నాయి. ఏ కొరతా లేదు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. logo