శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 01:08:54

జనవరిలో వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం

జనవరిలో వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం

  • రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ లేదు
  • మంత్రి ఈటల రాజేందర్‌

ఇల్లందకుంట: జనవరిలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శుక్రవారం మంత్రి  కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో ముక్కో టి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట చర్చిల్లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇల్లందకుంటలో మీడియాతో మాట్లాడారు. కరోనా బారిన పడకుండా మరో నెలరోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొదటి వేవ్‌లో కరోనా బలహీనపడుతున్నదన్నారు. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ వచ్చినట్టు ఆధారాలు లేవన్నారు. ఇప్పటివరకు బ్రిటన్‌ నుంచి 1,200 మంది రాగా, ఇందులో 900 మందిని గుర్తించామని.. ఆరుగురికి మాత్రమే పాజిటివ్‌ వచ్చినట్టు చెప్పారు.