శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 22, 2021 , 11:03:41

రెండోదశలో జర్నలిస్టులకూ కరోనా టీకా!

రెండోదశలో జర్నలిస్టులకూ కరోనా టీకా!

మహబూబాబాద్: కరోనా కష్టకాలంలో జర్నలిస్టులుసైతం విధులు నిర్వహించారని, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి రెండో దశ టీకా కార్యక్రమంలో వారిని కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ను కోరుతానని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని చెప్పారు. మహబూబాబాద్‌లోని తన నివాసంలో టీయూడబ్ల్యూజే డైరీని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. జర్నలిస్టుల సేవలను కొనియాడారు.

మహబూబాబాద్‌ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, వాటిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కట్టుకునేందుకు సాయమందించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని చెప్పారు. జిల్లాలో దాదాపు ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో చాలావరకు ఆక్రమణలకు గురయ్యాయని, కొంతమంది భూములను అమ్ముకున్న దాఖలాలు కూడా ఉన్నాయన్నారు. ఆ భూములపై సర్వే జరుగుతుందన్నారు. కాగా, జర్నలిస్టులు తమకు ఎలాంటి సమస్యలున్నా తనను సంప్రదించవచ్చని, నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు. 

VIDEOS

logo