రాష్ట్రవ్యాప్తంగా రేపు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రేపు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. టీకా ప్రారంభానికి ముందు ఏవైనా సమస్యలుంటే గుర్తించి పరిష్కరించడం, కొ-విన్ పోర్టల్ సామర్థ్యాన్ని తెలుకునేందుకే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న దేశవ్యాప్తంగా నిర్వహించిన డ్రై రన్లో భాగంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎంపిక చేసిన ఏడు చోట అధికారులు డ్రై రన్ నిర్వహించారు.
హైదరాబాద్‌లో గాంధీ దవాఖాన, తిలక్ నగర్ పీహెచ్సీ, నాంపల్లి ఏరియా దవాఖాన, సోమాజిగూడ యశోద దవాఖానతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర దవాఖాన, జానంపేట పీహెచ్సీ, మహబూబ్‌నగర్‌లోని నేహా సన్‌షైన్ దవాఖానల్లో డ్రై రన్ చేపట్టి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించారు. నామమాత్రపు (డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనే డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిది. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్‌లో హైదరాబాదీ అరెస్ట్