కరోనా వ్యాక్సిన్ ఆమోదం దేశానికే గర్వకారణం : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం తెలపడం దేశం గర్వించదగ్గ విషయమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. చెన్నైకి చెందిన శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల 7 రోజులపాటు నిర్వహించనున్న పాథాలజీ వార్షిక ర్యాపిడ్ రిప్యూ కోర్సు (ఎస్పీఏఆర్ఆర్సీ-2021)ను సోమవారం ఆమె వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సిన్ తయారీ, అభివృద్ధిలో భారత్ చొరవను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందని గుర్తు చేశారు.
వ్యాక్సిన్‌ను డబ్ల్యూహెచ్ఓ ఆమోదించడం మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న చాలాదేశాలు భారత్ తయారు చేసిన టీకా కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. భారత పరిశోధనపై విమర్శలకు టీకా అభివృద్ధితో మన శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారని అన్నారు. ప్రధాని మోడీ దూరదృష్టితో పరిశోధన సంస్థలకు ఆర్థిక ఊతం ఇచ్చి శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపడంతోనే వ్యాక్సిన్ తయారీ సాధ్యమైందని గవర్నర్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!
- ప్రభాస్‌తో ఢీ అనేందుకు సిద్ధమైన తమిళ హీరో
- కబడ్డీ.. కబడ్డీ.. అదరగొట్టెన్ అదనపు కలెక్టర్
- కాలినడకన తిరుమల కొండెక్కిన జబర్దస్త్ నటుడు
- అన్నాహజారేతో మహారాష్ట్ర మాజీ సీఎం భేటీ
- క్యారెక్టర్ ఎమోజీ పొందిన తొలి భారతీయ నటి సమంత !
- ఈత చెట్టుపై వాలి.. కల్లు తాగిన చిలుక
- రేపు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష