మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 01:54:19

అనుమతి లేకుండా కరోనా చికిత్స... దవాఖాన సీజ్‌

అనుమతి లేకుండా కరోనా చికిత్స... దవాఖాన సీజ్‌

నీలగిరి: అనుమతులు లేకుండా కరోనా వైరస్‌కు చికిత్స చేయడంతోపాటు.. రోగుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్న నల్లగొండ జిల్లాకేంద్రంలోని నవ్య దవాఖానను శనివారం అధికారులు సీజ్‌ చేశారు. చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన భిక్షం జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలతో ఈనెల 10న నవ్య దవాఖానలో చేరాడు. అతడికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే వైరల్‌ ఫీవర్‌ పేరుతో 10 రోజులు చికిత్స చేసి రూ. 6 లక్షల బిల్లు వేశారు. బాధితుడు డబ్బులు చెల్లించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్‌ ఆదేశం తో డీఎంహెచ్‌వో కొండల్‌రావు, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు, పోలీసులు శనివారం నవ్య దవాఖానలో తనిఖీలు నిర్వహించారు. దవాఖానలో టెస్టులు చేయకుండానే రోగులకు బిల్లులు వేస్తున్నారని, కేషీట్‌ నిర్వహణ కూడా సరిగా లేదని, అనుమతులు లేకుండా కరోనా వైరస్‌కు చికిత్స చేస్తున్నారని నిర్ధారించారు. దీంతో దవాఖానను సీజ్‌ చేసి, యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.   logo