శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 17, 2020 , 13:26:45

వలస కూలీకి కరోనా

వలస కూలీకి కరోనా

యాదాద్రి భువనగిరి : కరోనా నేపథ్యంలో బతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికలు ఉపాధి లేక తిరిగి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. అయితే అసలే ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్న వలస కూలీల పాలిట కరోనా మహమ్మారి శాపంగా  మారుతున్నది.  తాజాగా జిల్లాలోని అడ్డగూడూర్ మండలం మంగమ్మగూడెంలో ఇటీవల ముంబాయి నుంచి గ్రామానికి వచ్చిన ఓ కూలీకి కరోనా పాజిటివ్ గా తేలింది.  అతడికి పరీక్షలు చేయగా పాజిటివ్ గా వచ్చినట్లు మండల వైద్యాధికారి నరేష్ తెలిపారు. బాధితుడిని చికిత్స కోసం దవాఖానకు తరలించామన్నారు.


logo