శనివారం 06 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:58:22

ఢిల్లీ తెలుగు జర్నలిస్టుకు కరోనా

ఢిల్లీ తెలుగు జర్నలిస్టుకు కరోనా

  • స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఢిల్లీలో ఒక తెలుగు టీవీ చానెల్‌ ప్రతినిధికి కరోనా పాజిటివ్‌ రావటం కలకలం రేపుతున్నది. ఆ జర్నలిస్టు ట్రావెల్‌ హిస్టరీ ఆధారంగా ఎవరెవరిని కలిసారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులను క్వారంటైన్‌ చేసి జాగ్రత్తలు సూచించారు. సహచర జర్నలిస్టులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని సదరు జర్నలిస్టు ఇం టర్వ్యూ చేసినట్లు తెలుస్తున్నది. దీంతో కిషన్‌రెడ్డి సైతం హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం.  

జర్నలిస్టు కుటుంబానికి బాసట

కరోనా బారిన పడకుండా జర్నలిస్టులు జాగ్రత్త వహించాలని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ సూచించారు. ఢిల్లీలో కరోనా బారినపడిన జర్నలిస్టు  కుటుంబ అవసరాల నిమిత్తం వారి బ్యాంకులో రూ.20 వేలు జమచేస్తున్నట్లు తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న మిగతా జర్నలిస్టులకు రూ.10 వేలు చొప్పున వారి ఖాతాల్లో జమచేయనున్నట్లు చెప్పారు. 


logo