బుధవారం 03 జూన్ 2020
Telangana - May 11, 2020 , 01:12:28

ముందస్తు చర్యలతోనే కరోనా కట్టడి

ముందస్తు చర్యలతోనే కరోనా కట్టడి

  • విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట టౌన్‌ : సీఎం కేసీఆర్‌ ముందస్తు చర్యలతోనే ఉమ్మడి నల్లగొండలో కరోనాను కట్టడి చేయగలిగామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 12 చోట్ల ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లను ఆదివారం మంత్రి ప్రారంభించారు. మార్కెట్ల వద్ద వ్యాపారులు, ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  


logo