బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:28:30

గాలి ద్వారానూ కరోనా!

గాలి ద్వారానూ కరోనా!

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంటున్నదా? ఇప్పటి వరకు మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తున్న ఈ వైరస్‌ గాలి ద్వా రా వ్యాపిస్తున్నదా? అవుననే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సంకేతా లిచ్చింది. ఇప్పటి వరకు వైరస్‌ సోకిన వ్యక్తిని మరో వ్యక్తి తాకడంతో లేదా తుమ్ము, దగ్గు ద్వారా  ఇతరులకు వ్యాపిస్తున్నట్లు నిర్ధారించారు. ఇటలీలో కరోనా వేగంగా వ్యాప్తికి గాలి కూడా ఓ కారణమ ని తాజా పరిశోధనలో వెల్లడైనట్లు తెలుస్తున్నది. ఈ వైరస్‌ గాలిలో 3 గంటలకు పైగా బతికి ఉంటుందని, ఆ తర్వాత ఒక వాహకం కోసం ప్రయత్నిస్తున్నదని పరిశోధకులు భావించారు. వైరస్‌ మరింత బలపడుతూ రూపాన్ని నిత్యం మార్చుకుంటుందని డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. దీంతో గాలిలోని తేమ, ఉష్ణోగ్రతలను బట్టి వైరస్‌ జీవిత కాలం మారుతుందన్న ది. గాలిలో కొన్ని గంటల నుంచి కొన్ని రో జులు ఈ వైరస్‌ జీవిస్తుందని, ఈ క్రమం లో ప్రతీ ఒక్కరూ  మాస్క్‌లను ధరించ డం శ్రేయస్కరమని సూచిస్తున్నది. 


logo