బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 10, 2020 , 16:56:19

కరోనా పరీక్షలు.. రిపోర్టులు తారుమారు..

కరోనా పరీక్షలు.. రిపోర్టులు తారుమారు..

హైదరాబాద్‌ :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పని చేస్తున్న ఓ పోలీసు అధికారికి కరోనా పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లో చికిత్స   పొందుతున్నారు. అయితే ఆయనకు కరోనా నెగిటివ్‌ అని నిర్ధారణ కావడంతో గురువారం డిశ్చార్జి చేశారు వైద్యులు. కానీ ఆ పోలీసు అధికారికి కరోనా నెగిటివ్‌ నిర్ధారణ కాలేదు. రిపోర్టులో మాత్రం పాజిటివ్‌ అనే ఉంది. అయితే పోలీసు అధికారి చికిత్స పొందిన ఆస్పత్రిలోనే.. ఆయన పేరును పోలిన మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. దీంతో ఇద్దరి రిపోర్టులు తారుమారు అయ్యాయి. పోలీసు అధికారికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఇవాళ తేలింది. వయసు కూడా తేడా ఉంది. దీంతో అప్రమత్తమైన వైద్యులు, పోలీసులు.. హోం క్వారంటైన్‌లో ఉన్న పోలీసు అధికారిని మళ్లీ ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. 


logo