శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 01:56:56

53 లక్షలు దాటిన కరోనా టెస్టులు

53 లక్షలు దాటిన కరోనా టెస్టులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. ఇందులో 2.68 లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 2.56 లక్షల మంది కోలుకున్నారు. శుక్రవారం 41,991 పరీక్షలు చేయగా, 753 మందికి పాజిటివ్‌గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 133, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 78, రంగారెడ్డిలో 71 కేసులు వెలుగుచూశాయి. కరోనా రికవరీ రేటు దేశంలో 93.7 శాతం ఉండగా, తెలంగాణలో 95.49 శాతంగా నమోదైంది.

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు

వివరాలు శుక్రవారం మొత్తం

పాజిటివ్‌ కేసులు 753 2,68,418

డిశ్చార్జి అయినవారు 952 2,56,330

మరణాలు 3 1,451

చికిత్సపొందుతున్నవారు - 10,637


logo