బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:13:20

ప్రైవేటులో కరోనా టెస్టు ధర 850

 ప్రైవేటులో కరోనా టెస్టు ధర 850

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ధరలను రాష్ట్ర ప్రభు త్వం తగ్గించింది. ఇప్పటివరకు ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు ప్రైవే టు ల్యాబ్స్‌ రూ.2,200 వసూలు చేస్తున్నాయి. ఇంటికి వచ్చి శాంపిల్‌ సేకరించాలంటే రూ.2,800 వసూలు చేస్తున్నాయి. అయితే ఈ రెండు రకాల ఫీజులను వరుసగా రూ.850, రూ.1,200లుగా నిర్ణయిస్త్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రైవేటు ల్యాబ్స్‌లో పరీక్షల కోసం ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రతిరోజు 50 వేలవరకు ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 50 లక్షల పరీక్షలను ఉచితంగానే నిర్వహించి కరోనా పరీక్షలను గల్లీ వరకు చేరువ చేసింది. టెస్టు కిట్ల ధరలు అందుబాటులోకి రావడంతో నిర్ధారణ పరీక్షల ధరలు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే ప్రజలు డబ్బు వృథా చేసుకోకుండా ప్రభుత్వ ల్యాబ్‌లలోనే ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని, ఎలాంటి లక్షణాలు ఉన్నా సమీపంలోని ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.