శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 22:34:45

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో కరోనా పరీక్షలు

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో కరోనా పరీక్షలు

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఇకనుంచి కరోనా పరీక్షలు కూడా జరుగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు గానూ ఐసీఎంఆర్‌ అనుమతి లభించినట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ భానోత్‌ బలరాం నాయక్‌ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌, వరంగల్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇక నుంచి ఆదిలాబాద్‌లోనూ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కోవిడ్‌-19 పరీక్షల కోసం అధికారులు నెల రోజులు నుంచి కసరత్తు చేసి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దవాఖానలో ప్రస్తుతం ఉన్న టీబీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సిబినాట్‌ ల్యాబ్‌లో కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ల్యాబ్‌లో ఉన్న యంత్రాలకు మరికొన్ని పరికరాలను జోడించి కరోనా పరీక్షలు చేయనున్నట్లు రిమ్స్‌ అధికారులు తెలిపారు.  ల్యాబ్‌లో 9 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీరిలో ముగ్గురు మైక్రోబయోలజిస్టులు, ఆరుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు ఉంటారు. కొత్తగా ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 ల్యాబ్‌లో ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు చెందిన వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.logo