శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 17:17:29

ఇంట్లో పనిమనిషికి కరోనా లక్షణాలు.. గాంధీకి తరలింపు

ఇంట్లో పనిమనిషికి కరోనా లక్షణాలు.. గాంధీకి తరలింపు

కామారెడ్డి: జిల్లాలోని బీర్కూర్‌ మండల కేంద్రానికి చెందిన ఊళ్లే శివవ్వ(45) అనే మహిళకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆమెను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని మనుమడు(7), మనుమరాలు(9) పిల్లలు దుబాయ్ లో చదువుకుంటున్నారు. గత  07-03-2020 రోజు దుబాయ్ నుంచి వచ్చి హైదరాబాద్ చిందకుంటలోని పిల్లల మేనత్త వద్ద 15-03-2020 వరకు ఉన్నారు. అక్కడి నుంచి  వారి మామయ్య జేబీఎస్ నుంచి బస్సులో కామారెడ్డికి, అక్కడి నుంచి ఆటోలో బీర్కూర్ క్యాంపులో ఉన్న తమ స్వంత ఇంటికి రావడం జరిగింది. పిల్లలు ఇద్దరూ  హోం క్వారెంటైన్‌లో ఉంటున్నారు. స్థానిక డాక్టర్,  ఏఎన్ఎం ప్రతీరోజు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శివవ్వ  రెండు రోజుల క్రితం నుంచి జలుబు, పొడిదగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చింది. ఆమె ఆరోగ్యలక్షణాలు పరీక్షించిన వైద్య సిబ్బంది కరోనా వైరస్‌ సోకిందనే అనుమానంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.  అప్రమత్తమైన ఆరోగ్య సిబ్బంది ఇంటి యజమాని, వారి కుంటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. వారు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. శివవ్వ ఒంటరి మహిళ. 


logo