మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 14:14:49

అయ్యప్ప సొసైటీలో కరోనా అనుమానితుడు

అయ్యప్ప సొసైటీలో కరోనా అనుమానితుడు

హైదరాబాద్‌ : మహారాష్ట్రలోని పుణెకు చెందిన రాహుల్‌ అనే వ్యక్తి వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న రాహుల్‌.. అయ్యప్ప సొసైటీలో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల లండన్‌ నుంచి వచ్చిన రాహుల్‌.. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు. అయితే అతనికి దగ్గు, జ్వరం వచ్చింది. కళ్లు కూడా ఎర్రబడ్డాయి. ఇంటి యజమాని అప్రమత్తమై బల్దియా అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు.. రాహుల్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు. రాహుల్‌ భార్య, కూతురు మాత్రం పుణెలోనే ఉంటున్నారు.


logo
>>>>>>