సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 21:56:39

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్ : కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించకుండా బయటకు రావద్దని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో కలెక్టర్ వెంకటరావుతో కలిసి వర్షంలో ఆయన పర్యటించారు. కిరాణా దుకాణాలు, పండ్ల వ్యాపారులు, పెట్రోల్ బంక్‌లో పనిచేసే వారితో మాట్లాడారు. పెద్ద పెద్ద వైద్యులు సైతం కరోనాతో మృతి చెందుతున్నారని, అప్రమత్తంగా ఉంటూ ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు.

ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులు ధరించకుండా దుకాణాలకు వచ్చే వారికి సరుకులు ఇవ్వవద్దని వ్యాపారులకు మంత్రి సూచించారు. మాస్కులు ధరించని వారిని మందలించారు. వ్యాపారాలు సైతం మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించాలని పోలీసులకు సూచించారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo