శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 06, 2020 , 15:21:17

క‌రోనా సామెత‌లు

క‌రోనా సామెత‌లు

క‌ట్టె గొడ్డ‌లి కామ అయ్యి

త‌న వంశాన్ని తానే న‌రుక్కున్న‌ట్లు

రోగాల బారిన ప‌డుతున్నాం


క‌డ‌వంత గుమ్మ‌డికాయ‌

క‌త్తిపీట‌కు లోకువైన‌ట్లు

చెట్టంత మ‌నిషి

చీమంత క‌రోనాకు లోకువ‌


కాని కాలానికి

ఉత్త క‌ట్టె కూడా పామై క‌రుస్త‌ది

వాతావ‌ర‌ణం విష‌తుల్య‌మైన‌ప్పుడు

నిర్ల‌క్ష్యం విస్తృత‌మైన‌ప్పుడు

అంటు రోగాలు ప్ర‌బ‌లుతాయి


గాలిలో క‌లిసిన రోగం

అంట‌క మాన‌దు

కాలుకు చుట్టుకున్న పాము

క‌ర‌వ‌క మాన‌దు


కార్తి ముందు ఉరిమినా

కార్యం ముందు వ‌దిరిన చెడుతుంది

సంయ‌మ‌నం పాటిస్తే మేలు


- కొత్త అనిల్‌కుమార్‌


logo