గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 25, 2020 , 14:08:08

ఉస్మానియా నుంచి తప్పించుకున్న ‘కరోనా ఖైది’.. 12 గంటల్లో పట్టుకున్న పోలీసులు

ఉస్మానియా నుంచి తప్పించుకున్న ‘కరోనా ఖైది’.. 12 గంటల్లో పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ దవాఖానలోని ఐసోలేషన్ వార్డులో కరోనా సోకి చికిత్స పొందుతున్న అండర్ ట్రయల్ ఖైదీ సోమవారం తప్పించుకున్నాడు. 12 గంటలు తిరగక ముందే పోలీసులు ఆ ఖైదీని పట్టుకున్నారు. 

చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న వంశీధర్‌రెడ్డి అనే ఖైదీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జైలు నుంచి ఉస్మానియా దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. చికిత్స పొందుతున్నప్పుడు అతడు సోమవారం తెల్లవారుజాము దవాఖాన నుంచి తప్పించుకొని పారిపోయాడు. తరువాత అతడిని ఇబ్రహీంపట్నం వద్ద అఫ్జల్‌గంజ్‌ పోలీసులు పట్టుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo