ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 12:04:42

ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా

ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా

హైదరాబాద్‌ : ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో కరోనా టెస్టింగ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆదివారం వరకు ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ను మూసివేశారు. తిరిగి సోమవారం నుంచి ల్యాబ్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని కాలేజీ ప్రిన్సిపల్‌ శశికళ తెలిపారు. ల్యాబ్‌లో పని చేస్తున్న అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఐసీఎంఆర్‌ కింద పని చేస్తున్నారని పేర్కొన్నారు.

నిన్న మొత్తం 209 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 175 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ 10, రంగారెడ్డి 7, వరంగల్‌ అర్బన్‌ 2, మహబూబ్‌నగర్‌ 3, ఆసిఫాబాద్‌ 2, సిద్దిపేట 2, కరీంనగర్‌ 3, ములుగు 1, కామారెడ్డి 1, వరంగల్‌ రూరల్‌ 1, సిరిసిల్ల జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదు అయ్యాయి. ఒకరు వలస కార్మికుడు ఉన్నాడు.


logo