ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 14:40:20

వనపర్తి జిల్లాలో భార్య, భర్తకు కరోనా పాజిటివ్

వనపర్తి జిల్లాలో భార్య, భర్తకు కరోనా పాజిటివ్

వనపర్తి : జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజగా ఆత్మకూరు మండలంలో బలకిస్తపూర్ గ్రామంలో భార్య, భర్తలకు ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా, వీరు కొత్తకోటలో నివాసం ఉంటుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ కొవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నారు. ప్రజలు అనవరమైతే తప్ప రోడ్ల పై రాకుండా అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు ధరించడం, వీధుల్లో శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. కరోనా బాధితులను చికిత్స కోసం అధికారులు హైదరాబాద్ కు తరలించారు.


logo