యూకే నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా

హైదరాబాద్ : కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నది. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికులను వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి కరోనా పరీక్షలు చేస్తున్నది. యూకే నుంచి వచ్చిన వారిలో శనివారం మరో ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిద్దరిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకి చెందిన వారిగా గుర్తించారు. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇప్పటివరకు మొత్తం 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
వీరితో సన్నిహితంగా ఉన్న ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఆరుగురు, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా ప్రభుత్వం గుర్తించింది. వీరు హైదరాబాద్ గుండా తమ రాష్ట్రాలకు వెళ్లినట్లు ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించింది. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 184 మంది సమాచారం లేదని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్‌కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్‌ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్‌కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు
- భారత్ చేరిన మరో మూడు రాఫెల్స్