సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 17:38:18

నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

నాగర్ కర్నూల్ : జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ చెందిన ఒక వ్యక్తికి, నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. స్వీయ నియంత్రణతో కరోనాను ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు.


logo