గురువారం 02 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 12:11:50

ఎస్ బీఐ ఉద్యోగికి కరోనా.. బ్యాంక్ ను మూసివేసిన అధికారులు

ఎస్ బీఐ ఉద్యోగికి కరోనా.. బ్యాంక్ ను మూసివేసిన అధికారులు

నల్లగొండ : నల్లగొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా మెయిన్ బ్రాంచ్ ను అధికారులు మూసివేశారు. బ్యాంక్ లో పనిచేస్తున్న ఓ ఫీల్డ్ ఆఫీసర్ కు ఈరోజు ఉదయం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  విషయం తెలిసి బ్యాంక్ అధికారులు ముందు జాగ్రత్తగా బ్యాంక్ మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. బ్యాంక్ భవన్ లో వెనక భాగంలో ఉండే లోన్లు, రికవరీ సెక్షన్ లో ఓ ఫిల్డ్ ఆఫీసర్ మూడు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు.

దీంతో చికిత్స నిమిత్తం  హైదరాబాద్ కు వెళ్లాడు. అక్కడ అనుమానంతో శనివారం కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. దానికి సంబంధించిన రిపోర్ట్ ఈ రోజు ఉదయం రాగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బందిలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్యాంక్ ను మూసివేశారు. బ్యాంక్ లోని అన్ని విభాగాల్లో శానిటైజ్ చేయిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగితో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో వైద్య అధికారులు ఉన్నారు.


logo