శనివారం 30 మే 2020
Telangana - May 07, 2020 , 16:11:49

ముంబైలో జనగామ వాసులకు కరోనా పాజిటివ్‌

 ముంబైలో జనగామ వాసులకు కరోనా పాజిటివ్‌

యాదాద్రి భువనగిరి:  జిల్లాలోని నారాయణపురం మండలం జనగామకు చెందిన పలువురు ముంబైలో నివసిస్తున్నారు. వారిలో నలుగురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. జనగామకు చెందిన నలుగురు సోమవారం రాత్రి గ్రామానికి వస్తున్నట్లు తమ కుటుంబ సభ్యులకు తెలుపగా వారు నారాయణపురం మండల వైద్యాధికారికి సమాచారం ఇచ్చారు. వారిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని కింగ్ కోటి దవాఖాన లో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్లు తేలిందని యాదాద్రి జిల్లా వైద్యాధికారి మనోహర్ ధ్రువీకరించారు. అదే విధంగా ముంబాయి నుంచి కాలి నడకన గ్రామానికి చేరుకున్న 8 మందిని సైతం క్వారంటైయిన్ చేశారు.


logo