శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 20:21:30

భద్రాద్రి కొత్తగూడెం యువతికి కరోనా పాజిటీవ్‌

భద్రాద్రి కొత్తగూడెం యువతికి కరోనా పాజిటీవ్‌

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని అశ్వారావుపేట మండలానికి చెందిన యువతికి కరోనా పాజిటీవ్‌ వచ్చిన వైద్యులు నిర్ధారించినట్లు కలెక్టర్‌ డా. ఎంవీరెడ్డి ప్రకటించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన యువతి ఇటలీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మణుగూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినా తగ్గక పోవడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటీవ్‌ ఉన్నట్లు తేల్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.


logo