శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 14:02:05

ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి కరోనా పాజిటివ్

ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి కరోనా పాజిటివ్

నిజామాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు ఇలా ఎవరినీ వదలడం లేదు. తాజాగా జిల్లాలోని ఆర్మూర్ ఎమ్మెల్యే  ఆశన్నగారి జీవన్‌రెడ్డికి పాజిటివ్ గా తేలింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఎమ్మెల్యే హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. కాగా, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కొవిడ్‌ బారినపడి కోలుకున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.logo