గురువారం 02 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 15:25:05

అంత్యక్రియల్లో పాల్గొన్న 19మందికి కరోనా

అంత్యక్రియల్లో పాల్గొన్న 19మందికి కరోనా

హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కరోనా కలకలం సృష్టించింది. పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. జహీరాబాద్‌కు చెందిన 55 ఏండ్ల మహిళ అనారోగ్యం బారినపడగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఈ నెల 9న మృతిచెందింది. అదేరోజు రాత్రి ఆమెకు జహీరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. 

కరోనా లక్షణాలు కనిపించడంతో చికిత్స పొందుతుండగానే వైద్యులు ఆ మహిళ నుంచి నమూనాలు సేకరించారు. అందులో ఆమెకి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్నవారిలో 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 19 మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిని చికిత్సకోసం సంగారెడ్డి జిల్లా దవాఖానకు పంపించారు. అంత్యక్రియల్లో పాల్గొన్నవారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.


logo