ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌కు సపరేట్గా కొంత మంది అందాల భామలు ఉండేవారు. వారితో రెగ్యులర్‌గా స్పెషల్ సాంగ్స్ చేయించే వారు దర్శక నిర్మాతలు. ఇప్పుడలా కాదు స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేసేందుకు సై అనడంతో కొన్ని మూవీస్‌కి సంబంధించిన ఐటెం సాంగ్స్‌లో వారు మెరుస్తున్నారు. కాజల్ అగర్వాల్, తమన్నా వంటి అందాల భామలు ఇప్పటికే పలు ఐటెం సాంగ్స్ చేయగా ఇప్పుడు టక్ జగదీష్ చిత్రంలో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తుంది.
నానికి ‘నిన్ను కోరి’ లాంటి ఎమోషనల్ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం టక్ జగదీష్ అన చిత్రం చేస్తున్నాడు. ఈ నెలలోవిడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ లో ఒక స్టార్ హీరోయిన్ కనిపించబోతుందని తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రానికి తమన్ స్వరాలు కూరుస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.