బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 21:38:20

భారతమ్మ థైరాయిడ్‌తోనే అనుకుంది: కాని...

భారతమ్మ థైరాయిడ్‌తోనే అనుకుంది: కాని...

రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం చేగూరు గ్రామంలో మృతి చెందిన భారతమ్మకు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది. అయితే దీనిపై అనుమానాలను తొలగించేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తును చేపట్టారు. దీంట్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారతమ్మ ఇంట్లో 4 బీహార్‌కు చెందిన యువకులు అద్దెకు ఉంటూ వారు స్థానికంగా పని చేసుకుంటున్నారు. అయితే ఇటీవల సొంత ఊరుకు వెళ్ళిన వారు తిరుగు ప్రయాణంలో ఢిల్లీ ప్రార్ధనల్లో పాల్గొని తిరిగి వస్తున్న వారితో కలిసి ఈ నలుగురు బిహారీలు సంపర్క్‌ క్రాంతి రైలులో ప్రయాణీంచారని. ఆ సమయంలో వారికి ఈ కరోనా వ్యాధి సోకిందని పోలీసులు అనుమానించారు. ఈ నేపధ్యంలో వారి ఫోన్‌ నెంబర్లు ఆధారంగా విశ్లేషించారు.అప్పుడు పోలీసులకు కొంత ప్రాథమిక సమాచారం లభించింది.

ఇలా వచ్చిన వీరికి ఆరోగ్యంలో ఏలాంటి తేడాలు కనిపించకపోవడంతో యధావిధిగా తిరిగారు. కిరాణా దుకాణం నిర్వహించే భారతమ్మ దగ్గరకు వీరు తరచుగా వెళ్ళి నిత్యావసర సామాగ్రిని కోనుగోలు చేశారు. ఆ సమయంలో వీరి నుంచి ఆమెకు కరోనా సోకిందని స్పష్టమయ్యింది. అయితే అనారోగ్యం వచ్చిన భారతమ్మ తనకు థైయాయిడ్‌ ఉండడంతో గొంతు నొప్పి వచ్చిందని భావించి స్థానిక దవాఖానతో పాటు మహబూబ్‌నగర్‌లోని దవాఖానలో చూపించుకుంది. అయితే గ్రామంలో భారతమ్మ కరోనా వ్యాధితో మృతి చెందిందని తెలియగానే భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రభుత్వం అక్కడ దాదాపు 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికి భరోసాను కల్పించింది. పోలీసులు కూడా గ్రామస్థులు ఏలాంటి భయాందోళనకు గురవద్దని స్పష్టం చేస్తున్నారు.


logo