బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 08:39:30

కరోనా పాజిటివ్‌.. ఉరేసుకున్న బాధితుడు

కరోనా పాజిటివ్‌.. ఉరేసుకున్న బాధితుడు

మహబూబాబాద్‌ : తొర్రూర్‌ మండలం మడిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తి.. తన ఇంటి ముందు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మోతే జనార్ధన్‌ రెడ్డి(52) అనే వ్యక్తి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లాడు. నగరంలోనే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

దీంతో ఎవరికీ చెప్పకుండా.. స్వగ్రామమైన మడిపల్లికి నిన్న సాయంత్రం వెళ్లాడు. జనార్ధన్‌ రెడ్డి వచ్చిన విషయం పోలీసులకు తెలిసింది. ఇంట్లో నుంచి బయటకు రావొద్దని ఆయనకు పోలీసులు సూచించారు. మొత్తానికి బుధవారం తెల్లవారుజామున ఇంటి ముందు ఉరేసుకున్నాడు జనార్ధన్‌ రెడ్డి. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


logo